ఆంధ్ర ప్రదేశ్ లో మునిసిపల్ రిజల్ట్స్ కోసం అందరూ ఎదురుచూస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు గారికి మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్ . ఏ.పీ CID చంద్రబాబు పై కేసు నమోదు చేసింది . ఇందులో మాజీ మంత్రి నారాయణ గారిని చేర్చింది. సీఐడీ సైబర్ సెల్ డీఎస్పీ ఐ.సత్యనారాయణ ‘దర్యాప్తు అధికారి’ హోదాలో చంద్రబాబుకు ఈ నోటీసు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినా 41ఏ(3), (4) సీఆర్పీసీ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయవచ్చునని కూడా స్పష్టం చేశారు.
వారిపై... 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్ 34, 35, 36, 37 ఐపీసీలతోపాటు... ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్) (జి)లపైనా కేసు పెట్టారు. ఇది కక్ష సాధింపు అని తెలుగుదేశం వాళ్ళు వాదిస్తుంటే , చేసిన పాపం ఊరికే పోదు అంది జగన్ సర్కార్ అంటుంది మరి జనాలు చంద్రబాబు గారికి జగన్ చేతులో మూడిందని ఇంకా బాబు గారు కోర్టుకి వెళ్లి అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారా.
Join Us On Telegram For More Updates :
0 Comments