తెలంగాణాలో ట్.ఆర్.ఎస్ బలం ఎలావుందో ఈ రోజు తేలుతుంది . పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలు ఈ నెల 14 న జరిగిన విషయం అందరికి తెలుసు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో, వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు. జంబో బాలేట్ కారణంగా వీటి ఫలితాలు ఈ రోజు రాత్రి కి కానీ రేపు పొద్దున కు తేలిపోతాయి .
కే సి ఆర్ తన పార్టీ ని ఎలా గెలిపిస్తాడో చూడాలి. ఎప్పటిలాగే కే టి ఆర్ ప్రచారం తన భుజాల మీద వేసుకున్నాడు, కానీ ఈ మధ్య కొంచం చేదు అనుభవాలు ఎదురైనప్పటికి ఈ ఎన్నకలలో తప్పకుండ నెగ్గుతామని నమ్మకంతో ఉన్నాడు. కానీ బి జె పి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి కే టి ఆర్ నమ్మకం గెలుస్తుందో బి జె పి తన పోటీ ని నిలపెట్టుకుంటుందో . ఎవరి భవిష్యత్తు ఏమిటో పొద్దున కల్లా తేలిపోతుంది.
join us on telegram for more updates:
0 Comments